వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో, పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఈ శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.