ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాపై అప్రమత్తత అవసరం: బాలరాజు గౌడ్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదై ఉండేలా చూసుకోవాలని షాద్‌నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ లు అన్నారు. చౌదరి గూడ మండల పరిధిలోని జాకారం, ముష్టిపల్లి, ఎదిర, చెగిరెడ్డి ఘనపూర్, వనంపల్లి గ్రామాలలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. షాద్‌నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జిగా హాజరై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్