ఓటు హక్కును కాపాడుకోవాలి: మాజీ జెడ్పిటిసి

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును కాపాడుకోవాలని ఎక్స్ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, రాజకీయ పక్షపాతం లేకుండా సవరణ ప్రక్రియను నిర్వహించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్