వెల్ జర్ల లో పింఛన్ల కోసం పడిగాపులు

వెల్ జర్ల గ్రామంలో పింఛన్ దారుల పరిస్థితి దారుణంగా మారింది. వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ పొందేవారు నెలల తరబడి నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లు సకాలంలో విడుదల చేయాల్సి ఉన్నా, ఆలస్యం జరుగుతోంది. రెండు నెలల పింఛన్లు ఒకేసారి ఇవ్వాల్సి ఉండగా, నిధుల కొరతతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గ్రామంలో సుమారు 280 మంది పింఛన్ దారులు ఉండగా, వీరిలో చాలామంది నాలుగు నెలలుగా పింఛన్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్