షాద్‌నగర్ చౌదరి గూడ మండలం ఎలుక గూడ గ్రామ సర్పంచ్ బందయ్యపై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహమాదిగ తీవ్రంగా ఖండించారు. జాతర ఏర్పాట్లను జీర్ణించుకోలేని ఆధిపత్య సామాజిక వర్గం కుట్రతో ఈ దాడి చేయించిందని ఆయన ఆరోపించారు. దళితులు ఆధిపత్య దురహంకారుల కుట్రల్లో పావులు, బలిపశువులు కావద్దని, విద్య, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో పురోగమించాలని సూచించారు. దాడి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.