యువత హామీలను తుంగలో తొక్కితే సహించం: ప్రగతిశీల యువజన సంఘం

ఆదివారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్ లో నిర్వహించిన ప్రగతిశీల యువజన సంఘం (PYL) స్టడీ సర్కిల్ మరియు రాష్ట్ర కమిటీ సమావేశంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు హన్వేష్, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి రాకేష్, రాష్ట్ర కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల వేళ యువతకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడాన్ని తీవ్రంగా నిరసించారు. నిరుద్యోగ యువత ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, వార్షిక ఉద్యోగ క్యాలెండర్, రాజీవ్ యువ వికాస రుణాలు, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్