పాముకాటుతో ఓ బాలిక మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. దౌల్తాబాద్ మండల పరిధిలోని నందరం గ్రామానికి చెందిన సంగీత(16) ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటేసింది. చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు హైదరాబాద్ కు రిఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.