అత్యాచార ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఎమ్మెల్యే పరేష్రామ్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కుతుండగా బరుయిపూర్ సబ్ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 17 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. కానింగ్ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే దాస్‌పై అత్యాచారం, బెదిరింపులు, దోపిడీ తదితర కేసులు నమోదయ్యాయి.