అత్యాచార ఆరోపణలు.. గ్రామస్తుల దాడిలో యువకుడు మృతి

జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని గ్రామస్తులు ఒక యువకునిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి కనిపించకుండా పోయిన గ్రామానికి చెందిన బాలిక, మంగళవారం ఉదయం దొరికింది. ఓ యువకుడు తనను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో సుమారు 100-150 మంది గ్రామస్తులు ఆ యువకుడి ఇంటిని చుట్టుముట్టి, తల్లి దండ్రులను కట్టేసి, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్