9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ఏమీ తెలియ‌న‌ట్టు గాలింపులో పాల్గొన్న నిందితుడు!

మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. జున్నార్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న 4వ తరగతి బాలికపై పొరుగింటి సాహిల్ ఖైరే (25) అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో, నిందితుడు పోలీసులతో కలిసి గాలింపులో పాల్గొన్నాడు. సీసీటీవీ ఆధారాలతో పోలీసులు విచారించగా, నేరం అంగీకరించాడు. ఆగ్రహించిన స్థానికులు, నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పూణే-నాసిక్ హైవేను దిగ్బంధించారు.

సంబంధిత పోస్ట్