TG: పెళ్లి పేరుతో మోసం చేసి, రూ.30 లక్షలు దండుకుని, కులం పేరుతో దూషించాడనే ఆరోపణలపై బీఆర్ఎస్ నేత జక్కుల కిరణ్ కుమార్ పై నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. కిరణ్ కుమార్ తనకు ఇప్పటికే పెళ్లైన విషయం దాచిపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడని ఆరోపించింది. వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు తీసుకున్నాడని, డబ్బులు తిరిగి అడిగితే దూషించాడని బాధితురాలు పేర్కొంది.