AP: తుని ఘటన మరువక ముందే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఐ.పోలవరం మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. జనసేన నేత రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. స్కూల్ సమీపంలో ఉన్న భవనానికి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.