ఇన్‌స్టాలో పరిచయమైన బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికపై ప్రేమ పేరుతో ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టిన బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. హోటల్‌లో పనిచేస్తున్న బాలుడు, బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకున్నారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕