పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సామూహిక అత్యాచారం, విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వదంతులతో శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. సుమారు 2 వేల మంది విద్యార్థులు హాస్టల్ వద్ద నిరసనకు దిగగా.. అనంతరం కొందరు క్యాంపస్‌లోకి వెళ్లి సామగ్రిని ధ్వంసం చేసి, కొన్ని భవనాలకు నిప్పంటించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అత్యాచారానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా ఈ వార్తలను అవాస్తవమని పేర్కొన్నారు.