బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు కిల్లర్ ఉమేశ్ రెడ్డి 2 ఫోన్లు వాడటం, బ్యారెక్లో టీవీ ఉండటంతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అతడు 1996-2022 మధ్య 20మంది మహిళలను అత్యాచారం చేసి.. వారిలో 18మందిని చంపేశాడు. దీంతో SC ఉమేశు 30ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. విచిత్రం ఏమిటంటే తొలుత అతడికి కోర్టు మరణశిక్ష వేయగా తన మానసిక స్థితి బాగోలేదంటూ క్షమాభిక్ష కోరాడు.