AP: అనంతపురం జిల్లా, రాప్తాడు దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న బాధితురాలు, వైద్య సిబ్బంది సహాయంతో నడక సాధన చేస్తోందని, ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ముఖంపై కుట్లు తొలగించామని, ఆమె స్వయంగా ఆహారం తీసుకుంటూ, శ్వాస తీసుకుంటుందని వివరించారు. రాత్రి సమయాల్లో మాత్రమే ఆక్సిజన్ సాయం అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారని మంత్రులు స్పష్టం చేశారు.