కోలుకుంటున్న రాప్తాడు కేసు నిందితుడు హేమంత్

AP: రాప్తాడు కేసు నిందితుడు హేమంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా కార్డియాక్ ఐసీయూలోనే ఉన్న హేమంత్ పల్మనరీ ఎంబాలిజం సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులకు రక్త సరఫరా మెరుగుపడేందుకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕