మోడీ సొంత గ్రామంలో అరుదైన నాణేలు లభ్యం

ప్రధాని మోడీ సొంత గ్రామం గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో అరుదైన నాణేలు లభ్యమయ్యాయి. 2014 నుంచి దశాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఇండో-గ్రీకుకు చెందిన నాణేల అచ్చులు లభ్యమయ్యాయి. ఈ తవ్వకాల్లో 37 టెర్రకోట నాణేల అచ్చులను కనుగొన్నారు. కాస్టింగ్ పద్ధతిలో ఉన్న ఈ అచ్చులు ఇండో-గ్రీకు చక్రవర్తి అపోలోడోటస్-2 కాలానికి చెందినవిగా గుర్తించారని ASI సూపరింటెండెంట్ డా. అభిజిత్ అంబేకర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్