ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ ఇండియా విభాగానికి సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పనిచేయనున్నారని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ ప్రకటించారు. ఈ బాధ్యతలు చేపట్టడం తనకు గొప్ప గౌరవమని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. పిల్లల శ్రేయస్సు, వారి పెంపకం, సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి యూనిసెఫ్ ఇండియాతో కలిసి పనిచేయడం తనకు గౌరవంగా ఉందని ఆమె తెలిపారు.