మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలు రిచా ఘోష్‌కు పశ్చిమ బెంగాల్‌లో అరుదైన గౌరవం దక్కింది. ఆమె జన్మస్థలమైన సిలిగురిలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియానికి రిచా ఘోష్ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నవంబర్ 10న జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి కూడా పాల్గొన్నారు.