5.25 కిలోల బాలభీముడు జననం

TG: భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 19న రాత్రి ఓ మహిళకు ఏకంగా 5.25 కిలోలు బరువున్న బాలభీముడు(మగశిశువు) జన్మించాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన మడకం నందినికి పురుటి నొప్పులు రావడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్‌ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. ఆమెకు మూడో కాన్పు కాగా, ముగ్గురూ మగ సంతానమే.

సంబంధిత పోస్ట్