ఆకాశంలో అరుదైన ఎర్రటి మెరుపులు.. మీరు ఎప్పుడైనా చూశారా? (వీడియో)

టిబెట్ ఆకాశంలో ఇటీవల కనిపించిన అరుదైన ఎర్రటి మెరుపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాస్త్రవేత్తలు వీటిని ‘రెడ్ స్ప్రైట్స్’ లేదా ‘ట్రాన్సియంట్ లూమినస్ ఈవెంట్స్’గా పిలుస్తారు. ఇవి సాధారణ మెరుపుల మాదిరిగా కాకుండా భూమికి 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో, మేఘాల పైన ఏర్పడతాయి. శక్తివంతమైన పిడుగుల వల్ల ఉత్పన్నమయ్యే విద్యుత్‌, వాతావరణంలోని నైట్రోజన్ అణువులతో ప్రతిచర్య జరపడం వల్ల ఈ అద్భుతమైన ఎరుపు రంగు కాంతులు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అరుదైన ప్రకృతి దృశ్యం పరిశోధకులతో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్