తల్లి కడుపులోనే శిశువుకు అరుదైన శస్త్రచికిత్స

లండన్ వైద్యులు గర్భంలోనే ఉన్న శిశువుకు 'స్పైనా బైఫిడా' అనే అరుదైన వెన్నుపాము లోపానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కింగ్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్ వైద్యులు తల్లి పొత్తికడుపు ద్వారా గర్భాశయంలోకి సూక్ష్మ పరికరాలను పంపి, శిశువు వెన్నుపాము వద్ద తెరుచుకున్న కణజాలాన్ని మూసివేసి, నరాలు దెబ్బతినకుండా సరిదిద్దారు. ఈ కీహోల్ సర్జరీ ద్వారా బిడ్డ పుట్టిన తర్వాత నడవలేకపోవడం, మెదడు లేదా మూత్రపిండాల వైకల్యం వంటి ప్రమాదాలను నివారించారు. ఇది వైద్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్