'మైసా' కోసం 80 అడుగుల ఎత్తు నుంచి దూకిన రష్మిక!

నటి రష్మిక మందన్న తన రాబోయే చిత్రం 'మైసా' కోసం 80 అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద చిత్రీకరించిన ఈ సన్నివేశంలో ఆమెకు గాయాలైనప్పటికీ, షూటింగ్ కొనసాగించారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో బ్యాంకాక్‌లో వారం రోజుల పాటు కఠిన శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలతో కూడిన బలమైన పాత్రలతో రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్