రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలై ఆదరణ పొందిన ఈ చిత్రం, డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. భూమా (రష్మిక) మరియు విక్రమ్ (దీక్షిత్ శెట్టి) అనే ఇద్దరు పీజీ విద్యార్థుల ప్రేమకథ, వారి మధ్య తలెత్తే సంఘర్షణ, వారి బంధం నిలిచిందా లేదా అనేదే ఈ సినిమా కథాంశం.