ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సంస్థ సోమవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారణాసి టైటిల్ లాంచింగ్ ఈవెంట్‌లో హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, హిందూ మతభావాలను దెబ్బతీశారని ఆరోపించింది. సమాజంలో మతభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని, రాజమౌళిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాలని సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.