రేషన్ కార్డుల ప్రక్షాళన.. లక్షకు పైగా కార్డుల తొలగింపు!

తెలంగాణలో ప్రజాపంపిణీ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు, అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల ప్రక్షాళన 2025లో భారీగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, 2025లో రాష్ట్రంలో ఏకంగా 1,04,947 రేషన్ కార్డులను తొలగించారు. ఇది గత 3 (2022, 2023,2024) సంవత్సరాల్లో తొలగించిన మొత్తం కార్డుల కంటే 147 శాతం ఎక్కువ. మంగళవారం రాజ్యసభలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిమూబెన్ జయంతిభాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్