పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్ లేక కంటిని కొరికేసిన ఎలుకలు

TG: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రాయపర్తి మండలానికి చెందిన గారే వీరయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రిలోని శవపరీక్ష గదికి తరలించారు. ఆదివారం ఉదయం బంధువులు అక్కడికి చేరుకోగా.. మృతదేహంలోని కంటి భాగాన్ని ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. పోస్టుమార్టం గదిలో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్‌ సదుపాయం లేకపోవడమే ఘటనకు కారణమని బంధువులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕