లాక్‌డౌన్ సమయంలో తమిళ, మలయాళ సినిమాలు ఎక్కువగా చూసిన తర్వాత రూటెడ్ కంటెంట్‌తో సినిమాలు చేయాలనే ఆలోచన వచ్చిందని హీరో రవితేజ తెలిపారు. తాజాగా ‘ఇరుముడి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తెరిచిన ప్రతిసారీ ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా విశేషాలే కనిపిస్తున్నాయని, ప్రేక్షకులు సినిమాను ఎంతో ఆదరిస్తున్న తీరు ఆనందంగా ఉందని రవితేజ పేర్కొన్నారు.