రవితేజ సరికొత్త ప్రయోగం.. ట్రాన్స్‌జెండర్ పాత్రలో మాస్ మహారాజా!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణతో ‘ఇరుముడి’, యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. హసిత్ గోలి గతంలో ‘శ్వాగ్’ సినిమాలో ట్రాన్స్‌జెండర్ల అంశాన్ని స్పృశించారు. ఈ నేపథ్యంలో రవితేజ చేయబోయే సినిమాలో కూడా ఆయన ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్