రేయ్ చేతులు నరికేస్తా.. KA పాల్

తెలంగాణలో రేవంత్ రెడ్డి CM బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రైస్తవులు, దళితులు, చర్చిలపై దాడులు పెరిగాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇటీవల ఇద్దరు యువతులపై జరిగిన దాడి ఘటనపై ఆయన మండిపడ్డారు. నిందితులు రెండు రోజుల్లోనే బెయిల్ పై బయటకు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై దళితులు, అమ్మాయిలపై దాడులు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మూడు నెలల తర్వాత సీఎంగా ఉండరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕