రాయపాటి సాంబశివ రావు కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) అనారోగ్యంతో కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆయనకు, అది తిరిగి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుడిగానే కాకుండా, ప్రముఖ పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా రాయపాటి సాంబశివరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మృతితో టీడీపీ శ్రేణుల్లో మరియు ఆయన అనుచరుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕