AP: జనసేన పార్టీ మాజీ ఇన్‌చార్జి వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ హత్య వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డిని విచారించి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో బొజ్జల సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.