రూపాయి విలువపై ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా కీలక ప్రకటన

RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాట్లాడుతూ, రూపాయి విలువకు సంబంధించి తాము ఎలాంటి నిర్దేశిత స్థాయిలను నిర్ణయించుకోలేదని తెలిపారు. అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడమే రూపాయి విలువ పతనానికి కారణమని, దేశంలో తగినంత విదేశీ మారక నిల్వలున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో త్వరలో కుదరబోయే వాణిజ్య ఒప్పందం కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్