RBI ద్రవ్య పరపతి విధాన సమీక్షపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జూన్ 5న ఆర్‌బీఐ ప్రకటించే నిర్ణయం లోన్ EMIలు, FD వడ్డీ రేట్లపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తే మాత్రం వడ్డీ భారం తగ్గుతుంది. రేట్లలో మార్పు లేకపోతే హోమ్ లోన్, ఇతర ఫ్లోటింగ్ రేట్ లోన్ల EMIలు యథాతథంగా కొనసాగుతాయి. మరోవైపు, ప్రస్తుతం ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉండటంతో పెట్టుబడిదారులకు ఇది అనుకూల సమయంగా భావిస్తున్నారు. ఆర్‌బీఐ నిర్ణయం తర్వాతే బ్యాంకుల వడ్డీ విధానాల్లో మార్పులు ఉంటాయి.