IPL క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన RCB, 20 ఓవర్లలో 254 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (19) విఫలమైనా, కోహ్లి (43), పడిక్కల్ (30), కృనాల్ (43) రాణించారు. కెప్టెన్ రజత్ పాటీదార్ (93*) అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ (GT) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. GT బౌలర్లలో రబాడ, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు.
CREDITS: TATA IPL