ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ దూసుకుపోతోంది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు, ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ జట్టు విజయం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు. గతంలో బ్యాటింగ్‌పైనే ఆధారపడే ఆర్సీబీ, ఈ సీజన్‌లో తమ బౌలింగ్ వైవిధ్యంతో ప్రత్యర్థులను వణికిస్తోందని ఆయన తెలిపారు. పవర్ ప్లేలో వికెట్లు తీయడం, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయగల నైపుణ్యం తమ బలం అని ఫ్లవర్ పేర్కొన్నారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా వంటి బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన ప్రశంసించారు.