ఐపీఎల్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలచింది. వరుసగా రెండోసారి టైటిల్ కొట్టడంతో అభిమానులు డబుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్‌సీబీ హోంగ్రౌండ్ బెంగళూరులో టపాసుల మోత మోగింది. ఇటు ఏపీలోని విశాఖపట్నం బీచ్ రోడ్డుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. కారు పైకి ఎక్కి రచ్చ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని సంబరాలు చేసుకున్నారు.