రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఐన విరాట్ కోహ్లీకి రూ. 21 కోట్లు చెల్లించి దక్కించుకుంది. రజత్ పాటిదార్‌కు రూ.11 కోట్లు, యశ్ దయాళ్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలిపింది. విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడని తెలుస్తోంది. ఈ సారి ఆర్సీబీ జట్టులోకి పలువురు కీలక ఆటగాళ్లు రానున్నారు.