ఐపీఎల్ 2026 ఫైనల్‌‌లో ఆర్సీబీదే కప్: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ హాట్ ఫేవరెట్ అని, కప్పు గెలవడానికి వారికే ఎక్కువ అవకాశాలున్నాయని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ తమ దూకుడు ఆటతీరును కొనసాగించాలని, గుజరాత్‌కు సొంతగడ్డపై ఆడటం అతిపెద్ద అడ్వాంటేజ్ అని ఆయన పేర్కొన్నాడు. గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ, ఈ సీజన్‌లోనూ అద్భుత ఫామ్‌తో లీగ్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్