ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. RCB ఇచ్చిన 222 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకు పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (56) హాఫ్ సెంచరీతో రాణించారు. RCB బౌలర్లలో కృనాల్ పాండ్య 4 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్, యష్ తలో రెండు వికెట్లు తీశారు.