గత కొన్నాళ్లుగా టీమిండియా సెలక్షన్ కమిటీకి దూరంగా ఉన్న పేసర్ మహ్మద్ షమీ, రిటైర్మెంట్‌పై స్పందించాడు. శుభంకర్ మిశ్రా షోలో మాట్లాడుతూ 'నేను అలసిపోయానని భావించిన మరుక్షణం రిటైర్ అవుతాను. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను' అని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో 67 వికెట్లు తీసినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదని, అయితే ఫిట్‌నెస్ సమస్యల వల్లే ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పినట్లు తెలిపాడు.