పాకిస్తాన్ తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్

ఆపరేషన్ సిందూర్‌ను భారత్ స్వచ్ఛందంగా ఆపేసిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘ANI నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ, అవసరమైతే భారత్ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని, దేశ యుద్ధ సామర్థ్యం విస్తరించిందని, ఏ క్షణమైనా దాడి చేయడానికి వెనుకాడబోమని ప్రకటించారు. ఉగ్రవాద మూలాలున్న పాకిస్తాన్ రాజకీయ సిద్ధాంతాలపై దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్