భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. తమ శాంతి చర్చల్లో కశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకోవడం కూడా ఉందన్నారు. కాగా, పాకిస్థాన్‌తో కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే చర్చిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.