గతంలో పవన్ కళ్యాణ్‌తో తలెత్తిన వివాదంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వజ్రోత్సవాల సమయంలో జరిగిన సంఘటన తనకు గుర్తులేదని, పవన్ కళ్యాణ్ పై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని మోహన్ బాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఎలాంటి పాత్ర అయినా చేయడానికి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.