ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు.. నటుడు సోనుసూద్ నేను మీకు అండగా ఉంటానని వస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్రాలకు సోనుసూద్ రూ.2 కోట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకుంటామని సోనుసూద్ తెలిపారు. తన టీమ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని ఆయన తెలిపారు. సహాయం కోసం తనని సంప్రదించాలని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.