నోబెల్‌ రేసులో 'రియల్‌లైఫ్‌ ప్యాడ్‌మ్యాన్‌' అరుణాచలం

శానిటరీ ప్యాడ్‌లను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చి, గ్రామీణ మహిళల్లో రుతుక్రమంపై అవగాహన కల్పించిన సామాజిక పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనంతం, 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికయ్యారు. పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అమెరికన్ బృందాలు తన పేరును ప్రతిపాదించాయని, 24 గంటల్లోనే అది ఆమోదించబడిందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పట్ల తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అరుణాచలం సేవలకు గాను 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన జీవితం ఆధారంగా 'ప్యాడ్‌మ్యాన్' సినిమా విడుదలైంది.

సంబంధిత పోస్ట్