TG: నేతన్నకు భరోసా పథకం కింద కార్మికుల నమోదు ప్రక్రియ పూర్తికాగానే జియో ట్యాగ్ మగ్గం మీద పనిచేస్తున్నవారికి ఏటా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం చేనేత, జౌళి పథకాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ పథకానికి రూ.48.8 కోట్లు కేటాయించామని చెప్పారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ ప్రక్రియను తర్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.