జుట్టు రాలుతోందా.. ఈ సంకేతాలను గుర్తించండి!

రోజూ కొంత జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ, దువ్వెనలో, దిండుపై లేదా స్నానం చేసినప్పుడు సాధారణం కంటే ఎక్కువ జుట్టు కనిపిస్తే గమనించాలి. పోనీటైల్ పలుచబడటం, హెయిర్ పార్టింగ్ వెడల్పుగా కనిపించడం, హెయిర్‌లైన్‌లో మార్పులు వంటివి జుట్టు పలుచబడటానికి ప్రారంభ సంకేతాలు. నిద్రలేమి, పోషకాహార లోపం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు జుట్టు రాలడానికి కారణం కావచ్చు. అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలడం, స్కాల్ప్‌లో దురద, నొప్పి వంటి సమస్యలుంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕