ఈ ఏడాది మే నెలలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేసింది. లడ్డూల తయారీకి టీటీడీ రోజువారీగా 68 టన్నుల ముడి పదార్థాలను వినియోగిస్తోంది. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.